జగన్ అంతరంగమే కొమ్మినేని జర్నలిజం! వెకిలి చేష్టలు విపరీత అర్ధాలు ఆయనకు తెలిసిన విద్యలు! భయం అంటే తెలియాలి!
Mon Jun 09, 2025 14:57 Exclusives, Politics.202506091316.jpg)
ఆంధ్ర ప్రవాసి ఎక్స్ క్లూజివ్ ఆర్టికల్:
ద్వందార్థాలు.. విపరీత వ్యాఖ్యలు.. వెకిలిచేష్టలు.. ఇవే జగన్ స్టూడియోలో కొమ్మినేని ప్రదర్శించే విద్యలు
అడ్డగోలుగా నోటికి పనిచెప్పి, వెకిలిచేష్టలతో వెర్రిమొర్రి ఆనందం పొందినప్పుడు ఉండే ధైర్యం.. నమ్మకం.. ఆ చర్యల తాలూకా ప్రతిస్పందన, ప్రభావం గట్టిగా తగిలినప్పుడు కూడా ఉండాలి. మనిషనేవాడికి భయభక్తులు ఉండాలి. అవి లేవు.. నేను ఎవరినీ లెక్కచేయను.. నాకు నేనే తోపు.. నన్ను మించినవాడు లేడని చెప్పడం ఒకరకమైన మానసిక జబ్బు అనే చెప్పాలి. ఎవరికైనా భయం ఉంటుంది. అది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. నేడు జగన్ వీరవిధేయుడు, సోకాల్డ్ జర్నలిస్ట్.. సాక్షి ఛానల్లో ప్రధాన చర్చా నిర్వాహకుడు కొమ్మినేనిలో స్పష్టంగా కనిపించింది. నాలుగ్గోడల మధ్య రంగురంగుల ఫోకస్ లైట్ల వెలుతురులో ముఖానికి బెత్తెడు మందాన నానారకాల పౌడర్లు పూసుకొని, కృత్రిమమైన విషపు నవ్వుతో జగన్ అవినీతి ఛానల్లో కొమ్మినేని చేపట్టే చర్చా కార్యక్రమమే పెద్ద బూటకం. ఉన్నదిలేనట్టు..లేనిది ఉన్నట్టు.. జరగనిది జరిగినట్టు.. జరిగింది జరగనట్టు తనకు.. తన యాజమాన్యానికి అనుకూలంగా మార్చి కట్టుకథలతో తాను కొనసాగించేది చర్చ కాదు.. అదొక వీధినాటకమనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!
యాజమాన్యం అందించిన స్క్రిప్ట్ కు తోడు.. తాను జోడించిన ద్వంద్వార్థాలు.. విపరీత వ్యాఖ్యలు.. వెకిలి చేష్టలనే జగన్ స్టూడియలో నేర్చిన విద్యలతో కొమ్మినేని ప్రదర్శించే నటన చూడాలంటే కరుడుగట్టిన జగన్ ఫ్యాన్స్ కే సాధ్యం. ఆ గుండెధైర్యం వారికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ చర్చలో వాడే పదజాలం కంటే.. వీళ్ల మెదళ్లలో ఉండే డర్టీ లాంగ్వేజే ఎక్కువ కాబట్టి. అలాంటి డర్టీ బాబులకు చట్టప్రకారం డర్టీ పిక్చర్ చూపించకపోతే ఓట్లేసిన ప్రజలు ఊరుకుంటారా చెప్పండి.
ఇది కూడా చదవండి: మహిళలను అవమానించడమా లేక రాజధాని మీద వ్యతిరేకత చూపడమా?... ఏపీ మహిళా కమిషన్!
తన మనసులో ఉన్నది.. జగన్ అంతరంగంలోనిదే కొమ్మినేని దృష్టిలో అసలైన జర్నలిజం
తనకు.. తాను పనిచేసే ఛానల్ కు ఏమాత్రం సంబంధంలేని మహిళల్ని అకారణంగా, అన్యాయంగా తూలనాడటం కొమ్మినేని దృష్టిలో తప్పుకాదట. తనను అన్యాయంగా అరెస్ట్ చేయడమే పెద్ద తప్పట. జర్నలిస్ట్ పేరుతో చర్చలో పాల్గొని.. తాను తినేది అన్నమేననే విషయం మర్చిపోయి, ఆడబిడ్డల్ని అకారణంగా అనరాని మాటలన్న కృష్ణంరాజు కూడా మంచివాడే అన్నది కొమ్మినేని ఇన్నర్ ఫీలింగ్ ఏమో? చూడాలి రేపో.. ఎల్లుండో ఈ కొమ్మిరాజు.. ఆ కృష్ణంరాజు గురించి ఏం చెబుతాడో? జగన్ ప్రభుత్వంలో సాక్షి టీవీలో చర్చలు జరిగినప్పుడు అందులో పాల్గొన్న సభ్యులు ఎన్నోసార్లు అడ్డూఅదుపు లేకుండా నోటికి పనిచెప్పారు. అసలు చంద్రబాబును.. లోకేశ్ ను.. వారికి అండగా నిలిచిన వ్యవస్థలు. వ్యక్తుల్ని వెకిలిగా దూషించి తెగ ఆనందించేవారు. వారి వైఖరి మరీ శ్రుతిమిస్తోందనిపించి, చూసి తట్టుకోలేక ఎవరైనా నేరుగా కాల్ చేసి అలా మాట్లాడతారేంటి అనడమే ఆలస్యం.. పోలోమంటూ కొమ్మినేని గొంతుచించుకునేవాడు. ఫోన్ చేసినవాడినే తప్పుపట్టి... చర్చలో మాట్లాడినవారిని వెనకేసుకొచ్చేవాడు. తనకు తోచినట్టు..తన మనసు చెప్పినట్టు.. సాక్షి మేనేజ్ మెంట్ సూచించినట్టు, జగన్ అంతరంగం తెలిసినివాడిగా వ్యవహరించడమే కొమ్మినేని దృష్టిలో నిజమైన జర్నలిజం.
ఇది కూడా చదవండి: సాక్షి ఛానల్ కు బిగ్ షాక్.. సీనియర్ జర్నలిస్ట్ అరెస్టు! నెక్స్ట్ జగనే..
ఆ విధమైన జగన్ జర్నలిజం సాగించే చివరకు ఈ దుస్థితికి వచ్చావు కొమ్మినేని. రెడ్ బుక్ అమలుచేస్తున్నారు.. ప్రభుత్వ కుట్రలు... పాలకుల నిరంకుశత్వం అంటూ ప్రగల్భాలు పలకడం మానేసి, చేసింది తప్పని ఒప్పుకో. ఎవరు నీతో తప్పు చేయించారో.. ఎందుకు చేయించారో మనసులో ఉన్నది చెప్పుకో, అప్పుడైనా మనిషిగా పుట్టినందుకు నీ జన్మకు కొంతైనా సార్థకత కలిగించిన వాడివి అవుతావు అని పలు సామాజిక మధ్యమాలలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!
చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!
ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!
మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!
ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #KommineiJournalism #JaganMindset #PoliticalDrama #CheapAntics #TwistedNarratives #FearlessPolitics #MediaBias #ExposingTruth #AndhraPolitics #BoldStatements
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.